చంద్రబాబుకు “ఆల్జీమర్స్”..

roja pc

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిలా తయారై ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడారు. టిడిపి హయాంలో అప్పటి మంత్రులే గంజాయి సాగుపై బహిరంగంగా మాట్లాడారని, నాటి విషయాలను మరిచిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
సెబ్ వ్యవస్థను తీసుకువచ్చి రాష్ట్రంలో గంజాయి పై ఉక్కు పాదం మోపామని ఆమె చెప్పారు. వ్యవసాయం దండగ అని రైతుల జీవితాలను నాశనం చేసి, కాల్పులు జరిపించిన చంద్రబాబు, నేడు రైతులపై కల్లా బొల్లి ప్రేమ వలకబోయడం హాస్యాస్పదమని, టిడిపి హయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎంత వరకు అమలు చేశారో చెప్పాలని రోజా ప్రశ్నించారు. కుంభకోణాల కర్ణుడు చంద్రబాబు చెప్పే మాయ మాటలను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *