ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇనిస్టిట్యుట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇనిస్టిట్యుట్ టెక్నాలజీ (ఎన్ఐటి)కి చెందిన అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా రెండురోజుల పాటు జరిగిన సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న 29 ఐఐటిలు, ఎన్ఐటిలకు చెందినా డీన్ లు పాల్గొన్నారు. ఈ సమావేశాలను ఐఐటి హైదరాబాద్ బ్రాంచి డైరెక్టర్ బి.ఎస్.మూర్తి ప్రారంభించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి భోధన చేయాలనే అంశంపై సీనియర్ అధ్యాపకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జాతియ విద్యా విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చేపట్టాల్సిన చర్యల పై కూడా సమావేశం సుధీర్ఘంగా చర్చించింది.