మా "రూటే" సపరేటు.. - EAGLE NEWS

మా “రూటే” సపరేటు..

mha kcr c
mha kcr in

దేశంలో రాజకీయ మార్పు కోసం భారత రాష్ట్ర సమితి పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే  విపక్షాల “ఇండియా”లతో గానీ, అధికార కూటమి “ఎన్ డీ ఏ” తో గానీ చేతులు కలిపేదే లేదన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పర్యటనకు వెళ్ళిన కెసిఆర్ వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాము ఎవరి వైపు లేమని, ఉండబోమని తెల్సిచేప్పారు. కానీ, తాము ఒంటరిగా మాత్రం లేమని  మిత్రులతో కలిసే ఉన్నామని కేసీఆర్ అన్నారు.  50 సంవత్సరాలు వాళ్లు అధికారంలో ఉన్నా మార్పు రాలేదు. వివిధ స్థాయిల్లో తమ పార్టీకీ సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల యుద్ధ గంట మ్రెగించామని, మహారాష్ట్రలో తమ పని ప్రారంభించామని 14 లక్షల 10 వేల మంది పదాదికారులు ఉన్నారని అన్నారు. మరో 15 నుంచి 20 రోజుల్లో గ్రామ గ్రామాన పూర్తి స్థాయిలో పని పూర్తి చేస్తామన్నారు. మహారాష్ట్ర లాంటి అద్భుతమైన రాష్ట్రం లేదని ఇక్కడ అనేక వనరులున్నాయని అభిప్రాయపడ్డారు. సంపదకు కొదువలేదని, ఉపాధి అవకాశాలు అపారమని అన్నారు. ఔరంగాబాద్ వంటి నగరంలో నీటి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.  దళిత సమాజం ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. వారికి మహారాష్ట్రలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, అమెరికా వంటి రాష్ట్రం వివక్ష ను విడిచిపెట్టి బరాక్ ఒబామాను అధ్యక్షుడిని చేశారని కేసీఆర్ అన్నారు.ఇదిలా ఉంటే, బహుజన సామాజిక తాత్వికుడు, భారత పీడిత ప్రజల పక్షపాతి, సాహు మహారాజ్ సమాధిని ముఖ్యమంత్రి సందర్శించారు, సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి సాహుమహారాజ్ కు ఘన నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *