రాష్ట్రంలో ఇటివల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం వరంగల్,హన్మకొండ జిల్లాల్లో పర్యటించింది. ఏడుగురు సభ్యుల ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర బృందం హైదరాబాద్ నుండి నేరుగా హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు వాటిల్లిన నష్టం పై ఏర్పాటు హన్మకొండ, వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా కలెక్టర్లు సిక్టా పట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాలు కేంద్ర బృందాననికి వివరించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా జిల్లా లో భారీ వర్షాల వల్ల సుమారు 450 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. హన్మకొండ జిల్లాలో 58 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. ఈ భారీ వర్షాల వల్ల మొత్తం 14 మండలు ప్రభావితం అయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 41 చెరువులు దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బి 22 రోడ్లు 8.30 కీ.మీ పాక్షికంగా దెబ్బతిన్నగా, 3 వేల 65 మీటర్ల మేర రోడ్డు కోతకు గురియ్యింది వీటి అంచనా నష్టం 40 కోట్ల 32 లక్షలు గా ఉంది అని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధి లోని 61 రోడ్లు 138.78 కీ.మీ దెబ్బతిన్నాయని, జిల్లాలో 231 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి దెబ్బతిన్న పైప్ 32 కల్వర్ట్ లు పంచాయతీరాజ్ శాఖకు సంబందించి దెబ్బతిన్న బ్రిడ్జ్ లు 15 కల్వర్ట్లు ఉన్నాయి అని వీటి అంచనా నష్టం 3 కోట్ల 3 లక్షలు ఉండి అన్నారు. దెబ్బతిన్న పంట పొలాలు 1 వెయ్యి 84 ఎకరాలు ఉంది అని పంట నష్టం అంచనా 1 కోటి 8 లక్షల 40 వేలు గా ఉంది అన్నారు.841దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, అంచనా నష్టం 64 లక్షల 74 వేలు గా ఉంది అన్నారు జిల్లా లో 4 పునరావాస కేంద్రాలు ర్పటు చేయడం జరిగింది అని 270 మంది కి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు.3 రెస్క్యు టీములు పని చేశాయని అని అన్నారు. జిల్లా లో అంచనాల కు మించి వర్షం కురిసింది అని అన్నారు. అనంతరం కేంద్ర బృందం కలెక్టర్లు కమిషనర్, అధికారులతో కలిసి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జవహర్ నగర్, పోతన నగర్ ప్రాంతం లో భద్రకాళి బండ్ చెరువుకు గండి పడిన పప్రాంతంతో పాటు బొంది వాగుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ వరంగల్ కలెక్టర్లు సిక్టా పట్నాయక్ , ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ మహేందర్, ఆర్డివో రమేష్ కుమార్, సిపివో సత్యనారాయణ రెడ్డి నీటి పారుదల శాఖ,మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, ఆర్ అండ్ బి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బృందంలో ఎన్ డి ఎం ఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యార్థి (టీం లీడర్), డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, జలశక్తి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రమేష్ కుమార్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ పూను స్వామి, హైదరాబాద్ ఎన్ ఆర్ ఎస్సి డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే ఉన్నారు.
