hcu c cf

నిన్న “దొర” – నేడు “రెడ్డి”..!

అధికారంలో ఉన్న రాజకీయ నేతలకు పరిపాలనతో పాటు, అభివృద్ధి ముసుగులో కమీషన్ల వ్యాపారం చేయడం అనవాయితీగా మారుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొందరు నేతలు జైళ్ల దారి పట్టడమే దీనికి నిలువెత్తు సాక్ష్యం. అందులో తెలంగాణ నేతలు కూడా తక్కువేమీ కాదని చెప్పక తప్పదు. భూములు, నిధులు, నీరు, విద్య, ఉద్యోగం కోసం దశాబ్దాలుగా పోరు చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక  తెలంగాణ తిరిగి దొరలు, రెడ్డి నేతల దోపిడీకి గురవుతోంది. నిజాం పాలకుల నిరంకుశత్వానికి…

Read More
IMG 20250312 WA0044

19న తెలంగాణ బడ్జెట్..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 19న ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు వివిధ పద్దులపై సభలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ…

Read More
cong brs c

బలమైన ప్రభుత్వం – తెలివైన విపక్షం

తెలంగాణ ప్రజలకు ఉద్యమ ముసుగు వేసి పదేళ్ల పాటు అరాచక పాలన సాగించారు. మడకశిర కుటుంబం దుబాయ్ లోని “బుర్జ్ ఖలీఫా” శిఖరానికి ఎదిగింది. నీటి పేరు చెప్పి, కార్ల రేసులు చూపి, మద్యం మత్తు ఎక్కించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అవినీతి,అక్రమాలకు పోలీసులనే దొంగల ముఠాగా మార్చారు… ఇవీ ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి (భారాస) పై బహిరంగంగా వెల్లువెత్తిన ఆరోపణలు, పదేళ్ళూ తెర…

Read More
shake c

“సారు”తో నలుగురు…!

తెలంగాణ అంటే నేనే అంటూ విర్రవీగిన నాయకులు కెసిఆర్.. ఇరవై నాలుగేళ్ల పాలనలో మితిమీరిన విశ్వాసం ఒరిస్సా నేత నవీన్ పట్నాయక్ సొంతం.. కేవలం మరాఠీ భావజాలంతో రాజకీయ వ్యూహ రచనలు లేని మరో నేత ఉద్ధవ్ ఠాక్రే. అవినీతిని ఊడ్చి వేస్తామంటూ పదేళ్లు దేశ రాజధానిని ఏలి, “చీపురు కట్టను కవిత మద్యం”లో కలిపిన కేజ్రీవాల్… నా మాటే వేదం అంటూ ఆంధ్రప్రదేశ్ లో పాలనను గాడి తప్పించిన మహానేత తనయుడు జగన్ మోహన్ రెడ్డి……

Read More
Screenshot 20240725 122111 WhatsApp

“రావు” వెడలె ర”సభ”కు..

భారత రాష్ట్ర సమితి అధినేత, శాసన సభ్యులు చంద్రశేఖర్ రావు ఎట్టకేలకు సభలో అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అనారోగ్యానికి గురైన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు దూరంగా ఉన్నారు. గత సమావేశాల సమయంలో కోలుకున్నప్పటికీ ఆయన అసెంబ్లీకి రాలేదు. కరెంటు, కాళేశ్వరం, ఇంటిలిజెన్స్ వ్యవహారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినా కేసీఆర్ స్పందించలేదు. కానీ, ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా తప్పనిసరి రావలసిన పరిస్థితి ఏర్పడింది….

Read More
IMG 20240513 WA0030

“దొర” అడుగు పెట్టరా..?

రాష్ట్ర శాసనసభ సమావేశాలు అంటే ప్రజలకు అనేక ఆశలు ఉంటాయి. అందులో బడ్జెట్ సమావేశాలంటే మహా ప్రత్యేకం. ఈ బడ్జెట్ లో తమకు ఆమోదయోగ్యం కాని కేటాయింపులు, పథకాల పై ప్రశ్నించే గొంతుక కోసం వేచి చూస్తారు. అదే అధికార, ప్రతిపక్షాల మేళవింపు శాసనసభ. బలమైన అధికార పక్షం సభ ముందు ఉంచే అంశాలను అధ్యయనం చేసి తప్పు, ఒప్పులను ఎత్తిచూపాల్సిన నైతిక బాధ్యత ప్రతిపక్షానిది. కానీ తెలంగాణలో జరుగుతున్న తంతు విచిత్రంగా ఉంది. పదేళ్ల పాటు…

Read More
erravlli ala c

చేరికలా… చొరబాటులా…?

తెలంగాణా ఉద్యమ పార్టీ భారత రాష్ట్ర సమితి (భారాస)లో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన నేతలు ఎందుకు గోడ దూకుతున్నారు?భారాస గొడుగు నీడ గిట్టడం లేదా లేక ఆ పార్టీ అధినేత ఇస్తున్న భరోసా పై నమ్మకం సన్నగిల్లిందా? కేసీఆర్ నమ్ముకున్న నేతలు పక్కా పార్టీల వైపు ఎందుకు ఎగబాకుతున్నారు? భారాస రాజకీయ వ్యూహంలో భాగంగా ఫిరాయింపులు జరుగుతున్నాయా?  లేక నేతలు ఎవరికి వారు సొంత నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారా? అసలు ఎర్రవల్లి…

Read More
kcr bailreg

పిటిషన్ కొట్టివేత..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కు ఈ రోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన పై విచారణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేత్రుతవంలోని ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది.

Read More
guruvinda cf

గుర్తు లేదా”గురివిందా”..!

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి వింత పోకడలు విస్తు కలిగిస్తున్నాయి. తెలంగాణ వచ్చి దశాబ్దం గడచిన ఉద్యమ ఆలోచనల నుంచి బయటపడని కొందరు నేతల అనాలోచిత నిర్ణయాలు భారాస అధిష్టానానికి ఒక రకంగా తలనొప్పి తీసుకు వస్తున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే రాద్ధాంతం చేస్తున్న భారత రాష్ట్ర సమితి తీరు చూస్తుంటే గురివింద చందం గుర్తుకు వస్తోంది. ఉద్యమ పార్టీ పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అటు…

Read More
kcr kavit c

ఫామ్ హౌస్ లో”కరెంటు”- జైలులో”మత్తు”.!

బుకాయించడంలో ఉద్యమ పార్టీ అధిపతులు ఒకరిని మించి మరొకరుగా ఉన్నారు.  హైదరాబాద్  నుంచి  కోట్ల రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణంలోకి పకడ్బందీగా పావులు కదిపిన కల్వకుంట్ల కవిత తీహార్ జైలు ఊసలు లెక్కబెట్టే వరకు ముడుపులతో ఏ మాత్రం సంబంధమే లేనట్టు మీటింగుల్లోనూ, మీడియా ముందూ బుకయించిన సంగతి అందరికీ తెలిసిందే. డేటా మొత్తాన్ని తొలగించి తనకేమీ తెలియదు అన్నట్టు ఫార్మాట్ చేసిన ఫోన్ లను విచారణ సంస్థల చేతిలో పెట్టిన ఆమె జైలు జీవితం నెలలు…

Read More
reviw c

ఇక్కడ”దోపిడీ”-అక్కడ”అరాచకం”..!

తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజంగా తెలివైన వారే అని ప్రపంచానికి చాటారు.మాటలు ముఖ్యం కాదు, చేతలు కావాలని తేల్చి చెప్పారు. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీని చిత్తుగా ఓడించారు. మొన్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపిని నామరూపాలు లేకుండా చేశారు. తెలంగాణలో “కారు”ని షెడ్డుకి పంపితే, ఆంధ్రాలో “ఫ్యాన్”గాలి సోకకుండా అదుపు చేశారు. అదే తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం. అయితే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఆంధ్రా రాష్ట్రంలో వైసిపి కుదేలు కావడానికి ఒకటే…

Read More
brs hiway c

దొడ్డి దారులు – దొంగల ముఠా..!

ఉద్యమ పార్టీ పేరుతో దశాబ్ద కాలం తెలంగాణ పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి రాష్ర్టంలో రహదారుల అభివృద్ధికి సమాంతరంగా గుట్టు చప్పుడు కాని “దొడ్డి దారులు” కూడా బార్లా తెరిచింది. కవిత నాయకత్వంలో తెలంగాణా నుంచి ఢిల్లీ వరకు ఏకంగా “మద్యం” జాతీయ రహదారిని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో అక్రమ వసూళ్ల కోసం కొందరు అవినీతి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎంచుకొని పోలీసులతోనే “దొంగల ముఠా”ను తయారు చేసింది. ఈ ముఠా కోసం…

Read More
IMG 20240422 WA0004

“రాజద్రోహ” వ్యూహం..!

ప్రజల సమ్మతి, వారి ఆకాంక్షల మధ్య అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయడం నిజంగా రాజ ద్రోహం కిందికే వస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతలు చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు తెలంగాణ ప్రజలను విస్తుపరుస్తున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరతారని, ఇప్పటికీ 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో బేరసారాలు…

Read More
IMG 20240406 WA0018

జైల్ లో “ఇల్లు” కట్టిస్తా..

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన “కాంగ్రెస్ జన జాతర’ సభలో ఆయన ప్రసంగించారు. “కేసీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటానని ఆయన అనుకుంటున్నారు. అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదనీ, రేవంత్ రెడ్డిననీ, ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్ ను జైలులో పెడతామని హెచ్చరించారు. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం” అని రేవంత్…

Read More