రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి కొద్ది రోజుల్లో రెండో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. వేతన సవరణపై అసెంబ్లీలో మాట్లాడుతూ వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయడమే కాక, మధ్యంతర భ్రుతి కూడా ప్రకటిస్తామని తెలిపారు.