పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి వాగు దాటడానికి నానా తంటాలు పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎలిసెట్టి పెల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దబ్బగట్ల సునీతకు పురిటి నొప్పులు రావడంతో పొంగిపొర్లుతున్న జంపన్న వాగు దాటలేక అవస్థలు పడింది. దీంతో స్థానికులు ఆమెను ఎలాగైన వాగు దాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
గజ ఈత గాళ్ళ సాయంతో ఆమెను ట్రాక్టర్ టైరు పై కూర్చోబెట్టి జగ్రత్తగా వాగు దాటించారు.ఇక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఇలాంటి అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వాగు పై బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నారు..
ఎంత కష్టం…
