మళ్లీ నోటీసులు…

jagan notic

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తెలంగాణ ఉన్నత న్యాయ స్థానంలో విచారణకు వచ్చింది. హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హరిరామ జోగయ్య వేసిన పిల్ ను పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై మొదట విచారణ చేశారు. అనంతరం హైకోర్టు పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకుంది. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకారంచింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి నెంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. జగన్ పై సీబీఐ కోర్టులో ఉన్న కేసుల విచారణను వేగంగా పూర్తయ్యేచర్యలు తీసుకోవాలని, 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే ఈ కేసుల వ్యవహారాన్ని తేల్చేలా ఆదేశాలివ్వాలని  హరిరామ జోగయ్య పిల్ లో కోరారు. దీంతో ప్రతివాదులు జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *