IMG 20240610 WA0003

పోరుకు “జై స్వరాజ్”

తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలకు జై స్వరాజ్ సిద్ధం అవుతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్ళు దాటినా నేటికీ మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు అందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టలేదని ఆయన అన్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ మాయమాటలతో కాలయాపన చేస్తే, పచ్చి అబద్ధాలతో వచ్చే ఐదేళ్లు వెళ్లబుచ్చే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోందని కేఎస్ఆర్ గౌడ్ వివరించారు. హైదరాబాద్ లో జరిగిన పార్టీ…

Read More
IMG 20240602 WA0049

అభివృద్ధి వ్యూహం…

తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగ్‌ రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని ఆయన అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో సీఎం…

Read More
IMG 20240530 WA0034

ఇక “జయ జయహే”..

’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు…

Read More
IMG 20240527 WA0031

మళ్లీ ఉక్కపోత..

నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఆంధ్ర ప్రదేశ్ లో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళా ఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడు తుందని భావించారు. కానీ, “రెమాల్” తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణ లోనూ జూన్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం…

Read More
IMG 20240527 WA0029

ఏర్పాట్ల “పరేడ్”…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌడ్స్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభాప్రాంగణం లో ఇబ్బందులు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. స్టేజ్ ఏర్పాట్లు, బారికేడింగ్, సభాప్రాంగణంలో విధ్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టం, ఎల్ ఇ డి స్ర్కీన్ ల ఏర్పాట్ల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు….

Read More
rvnth tpt

తెలంగాణా మండపం…

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మనవడి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వసంత సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో…

Read More
brs hiway c

దొడ్డి దారులు – దొంగల ముఠా..!

ఉద్యమ పార్టీ పేరుతో దశాబ్ద కాలం తెలంగాణ పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి రాష్ర్టంలో రహదారుల అభివృద్ధికి సమాంతరంగా గుట్టు చప్పుడు కాని “దొడ్డి దారులు” కూడా బార్లా తెరిచింది. కవిత నాయకత్వంలో తెలంగాణా నుంచి ఢిల్లీ వరకు ఏకంగా “మద్యం” జాతీయ రహదారిని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో అక్రమ వసూళ్ల కోసం కొందరు అవినీతి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎంచుకొని పోలీసులతోనే “దొంగల ముఠా”ను తయారు చేసింది. ఈ ముఠా కోసం…

Read More
IMG 20240406 WA0018

జైల్ లో “ఇల్లు” కట్టిస్తా..

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన “కాంగ్రెస్ జన జాతర’ సభలో ఆయన ప్రసంగించారు. “కేసీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటానని ఆయన అనుకుంటున్నారు. అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదనీ, రేవంత్ రెడ్డిననీ, ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్ ను జైలులో పెడతామని హెచ్చరించారు. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం” అని రేవంత్…

Read More
IMG 20240403 WA0024

ఆదుకొనే బాధ్యత …

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గల్ఫ్ జెఏసీ బృందం కృతజ్ఞతలు తెలిపింది.గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభం చేసినందుకు తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి) బృందం ముఖ్యమంత్రిని కలిసి హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం ఏర్పడిన వంద…

Read More
dandplaym c

ప్రభుత్వంలో “దండుపాళ్యం”ముఠా…!

గత పదేళ్ళుగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పాలనలో సాగిన తెర వెనుక భాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూడడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన గులాబీ దళం ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎంతోకొంత లబ్ధి పొందేందుకు నానా తంటాలు పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టే వరకు కాళేశ్వరం, ధరణి వంటి అంశాలలో లోసుగుల వ్యవహారాలు మాత్రమే బయటకు పొక్కాయి. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

Read More
press

సమస్యలు సమ్మతమే…

దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, “జర్నలిస్ట్స్ డిమాండ్ డే”కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్…

Read More
kavit kejri pc

సౌత్ గు”లాబీ” ఉచ్చులో కేజ్రీవాల్ …!

వందల కోట్ల కుంభకోణంతో ఢిల్లీ నుంచి తెలంగాణా వరకు కుదిపేసిన ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కవిత కోఠరీలో చిక్కుకున్నారా…? అందుకే దేశంలో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అరెస్టు అయ్యారా..? “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం .. మీ కోసం..

Read More
brs natnl cc

మూలిగే “బిఆర్ఎస్”పై “మందు సీసా”…!

తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు కళ్ళాలు లేని గుర్రంలా పరుగులు తీసిన భారత రాష్ట్ర సమితి ఆ ఎన్నికల ఫలితాల అనంతరం సావడికే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతులేని ఆలోచనలతో రంకెలేసిన భారాస అధినేత, ఆయన అనుచరగణం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ళ తిరుగులేని పాలనలో జరిగిన అవినీతి,అక్రమ వ్యవహారాలు ఒక్కసారిగా గుప్పుమనడం భారాస మనుగడకు తలనిప్పిగా మారడం ఒక సమస్య అయితే, ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత…

Read More