రాష్ట్రంలోని రెండు శాసన సభ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు 9వ తేదిన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు వేస్తారు. ఉదయం 10:45 గంటలకు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10:55 కు గజ్వేల్ టౌన్ లోని సమీకృత పభుత్వ కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య గజ్వేల్ లో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. తిరిగి ఎరవెల్లికి చేరుకొని మధ్యాహ్న భోజనం తర్వాత 1:40 గంటలకు కామారెడ్డికి బయలు దేరతారు.మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో కుడా రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేస్త్తారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొంటారు.
గతంలో చంద్ర శేఖర్ రావు సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58935 మెజార్టీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64014 ఓట్లలతో గెలిచాడు. యు.పి.ఎ ప్రభుత్వం 2010 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95858 ఓట్లతో కెసిఆర్ సిద్ధిపేట నుంచి విజయం సాధించారు.