“గద్దెల” వద్దకు హెలీకాప్టర్..

medarm hli

మేడారం జాతర…ఇది తెలంగాణ “కుంభమేళా” గా ప్రత్యేక గుర్తింపు ఉంది. వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలీకాప్టర్ స్థాయికి చేరుకుంది. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలీకాప్టర్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి.ఈ నెల 21 నుంచి 25 వరకు హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేశారు. ఇలా వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలీకాప్టర్ జాయ్‌ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చు. హన్మకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా వి.ఐ.పి. దర్శనాన్ని పొందవచ్చు.. దీని ధర ఒక్కొక్కరికి రూ. 28,999.. హెలికాప్టర్​లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. మరో రైడ్ జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో హెలీకాప్టర్ చక్కర్లు కొట్టనుంది. అమ్మ వారి గద్దెల పక్క నుంచి మొదలయ్యే రైడ్‍ జంపన్న వాగు, చిలుకల గుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది. దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 4800 ఛార్జీ వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం, ఈ ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 04003 99999, లేదా infor@helitaxi.comలో ఆన్‌లైన్‌ లో సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *