వరంగల్ లోక్ సభ టికెట్ ఆశిస్తున్న అమెరికన్ ఎన్నారై చింత ప్రవీణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ ని కలిశారు. ‘నేను “ద్వేషం” యొక్క మార్కెట్‌లో “ప్రేమ” దుకాణాన్ని తెరుస్తున్నాను’, హక్కుల కోసం పోరాటం చెయ్ అని ప్రవీణ్ ను ఈ సందర్భంగా రాహుల్ ప్రోత్సహించారు.

అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, సింగపూర్ నుంచి వచ్చిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు రాహుల్ ను కలిశారు.ఈ యాత్రలో మాజీ ఎంపీ మధుయాష్కీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా శాఖ అధ్యక్షులు మొహిందర్ సింగ్ గిల్జియన్, ఏఐసీసీ కార్యదర్శి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ ఆరతి క్రిష్ణ తదితరులను ప్రవీణ్ కలిశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కోసం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత చింత ప్రవీణ్ దరఖాస్తు చేసుకున్నారు.