
నాటండీ
రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ హరిత సేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా…
రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ హరిత సేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని నటి కేతన రాజ్ అన్నారు . ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అందరిని చిన్న, పెద్ద, పార్టీలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ నాటించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఏడు సంవత్సరాల నుండి నిరంతరం మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞం లా…
సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమనీ, దీనిపై రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యం అఅనే విషయం గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిపోయిందన్నారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని…
Director General and Commissioner of Police, Hyderabad, C.V. Anand, IPS, has been awarded the prestigious “Excellence in Anti-Narcotics Award” at the World Police Summit (WPS) 2025, organized by the Dubai Police from May 13 to May 16, 2025. Representing the Hyderabad Narcotics Enforcement Wing (H-NEW), Anand received the top honour in recognition of his department’s…
ఖతర్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖతర్ లుసైల్ ప్యాలెస్‌లో నిర్వహించిన విందులో ట్రంప్‌తో పాటు ఖతర్ షేక్ ఎమిర్ తమిమ్ బిన్ హమీద్‌తోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో పలు అంశాలపై అంబానీ కాసేపు చర్చించారు. రిలయన్స్ చీఫ్ అమెరికా వాణిజ్య కార్యదర్శి స్టీవ్ లుట్నిక్‌తో అంబానీ స్నేహపూర్వకంగా సంభాషించడం విశేషం. అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం ఖతర్ సర్కార్ ఏర్పాటు చేసిన ఈ…
దేశంలో రానున్న ఐదు రోజుల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ , సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అండమాన్ నికోబర్ దీవులలోనూ రాబోయే 5 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం…
కొన్ని దేశాల్లో మళ్ళీ వైరస్ విస్తరిస్తోంది. నాలుగేళ్ల పాటు సుప్తావస్థలో ఉన్న వైరస్ లు తిరిగి చలన స్థితికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హాంకాంగ్‌లో ఏడాది వయస్సు దాటిన చిన్నారులకు వైరస్ సోకుతోంది. ఈనెల 3వ తేదీన తొలి కేసు నిర్ధారణ కాగా,వారం రోజుల్లోనే వేల సంఖ్యకు చేరాయి. ఒక్క సింగపూర్…
ఏ సంఘటనలోనైనా, ఏ కేసులోనైనా బాధితులకు న్యాయం జరిగిందంటే నిందితులకు సరైన శిక్ష పడ్డట్టు అర్ధం. కానీ, దేశ ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన పహల్గాంలో పర్యాటకుల ఊచకోత ప్రభుత్వ చేతగాని తనానికీ, నిఘా వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఆ సంఘటన అనంతరం జరిగిన అనేక పరిణామాలు అంతుపట్టకుండా ఉన్నాయి. చివరకు ముష్కరుల తుపాకులకు బలైన వారి ఆత్మలను సైతం క్షోభ పెడుతున్నాయి. కాశ్మీరు లోయలో ఏరులై పారిన రక్తపు ధారలు ఇప్పుడు రాజకీయ పార్టీ…
పగ చల్లారిందా? ఎక్కుపెట్టిన “సుదర్శన చక్రం” నిస్సహాయంగా మిన్నకుండి పోయిందా? మంచు కొండల పచ్చిక బైళ్ళలో అమాయకులను విచక్షణా రహితంగా కాల్చి చంపిన ముష్కరులు ఏమైపోయారు? వాయు వేగంతో శత్రు దేశంపై విరుచుకు పడిన ఆవేశం అకస్మాత్తుగా ఎందుకు ఆవిరై పోయింది? కాశ్మీర్ వాస్తవాధీన రేఖను ఎందుకు చెరిపివేయలేక పోయాం? ఇందులో ప్రపంచ “పెద్దన్న” జోక్యం ఏ మేరకు ఉంది? అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్.) ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయల నిధులు పాకిస్థాన్ కి…
మహాభారత, రామాయణ కాలాల్లో దుష్ట శిక్షణ కోసం అస్త్రంగా వాడినట్టు చెప్పుకునేది “సుదర్శన చక్రం”. మహా విష్ణు కుడి వైపు వెనుక చేతిలో ఉంటుందని ఇతిహాస ,పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్యాస్త్రమే శిశుపాలుని తల నరికింది. కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు సూర్యుడిని కప్పి ఉంచడానికి ఉపయోగించారు. అర్జునుడి కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుని జయధ్రుతుడిని చంపడానికి కూడా దోహదపడింది . ఋగ్వేదంలో సుదర్శన చక్రాన్ని విష్ణువుకు చిహ్నంగా, కాల చక్రంగా, మహా భారతంలో కృష్ణుడి ఆయుధంగానూ సుదర్శన చక్త్రం ప్రసిద్ధి. ఈ…
జమ్మూ టార్గెట్‌గా పాకిస్థాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు భారత్ ఎస్-400 సుదర్శన్ చక్ర, ఎల్-70, జెడ్.ఎస్.యు -23. శిఖ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇండియన్ ఆర్మీ యాక్టివేట్ చేసింది. దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు రక్షణ శాఖ మంత్రి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుంచి పాకిస్థాన్ దొంగ చాటు దాడులను తీవ్రతరం చేసింది. దీనికి ధీటుగా బదులు చెప్పడానికి భారత సైన్యం కూడా సన్నద్ధం అయింది.
మొన్న రాత్రి జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది పాక్ ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి “ఆపరేషన్ సిందూర్” పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ లోని ల్రైబరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురునేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ పై రక్షణ మంత్రి…
“ప్రపంచ సుందరి” కిరీట పోటీల ప్రారంభానికి సమయం దగ్గర పడింది. ఈ నెల పదో తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 115 దేశాలకు చెందిన మిస్ వరల్డ్…
పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సింధూర్” పేరిట పాకిస్థాన్, దాని ఆక్రమిత కశ్మీర్‌లో కచ్చితమైన క్షిపణి దాడులు నిర్వహించింది. దీంతో దాయాది దేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసి వేసి గస్తీని ముమ్మరం…
ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి కలిసి వచ్చే ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలతో ఉమ్మడిగా ఉద్యమం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు గాయంతో బాధపడుతున్న కేఎస్ఆర్ గౌడను ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్, ఆ పార్టీ నేతలు రాజు, తివారీ ఈ రోజు హైదరాబాద్లోని మెట్టుగూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో కలిసి…
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్ర మూక స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం ఇచ్చే వారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. కానీ, పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయినట్టు తెలిపింది. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?…