ఏయ్…

hijra

మిర్యాలగూడలో హిజ్రాలు హాల్ చల్ చేశారు. అదీ ఎక్కడో కాదు సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ లోనే జరగడం విశేషం. హిజ్రాల పరస్పర ఘర్షణలు, కొట్లాటలతో స్టేషన్ ఆవరణ హోరెత్తింది.వివరాల్లోకి వెళ్తే, పట్టణంలో ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో వన్‌ పోలీస్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పీఎస్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదంలో ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. అనంతరం తమదైన పద్ధతిలో పరిస్థితిని అదుపు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *