
టెక్నాలజీ సమర్థంగా వినియోగించుకుంటే ఎవరైనా మంచి ఫలితాలు సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యంలో డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన సదస్సులో అయన పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు టెక్నాలజీ పై దృష్టి సారించాడ వల్లే హైటెక్ సిటీ అందుబాటులోకి వచ్చిందన్నారు. అప్పటి ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి డీ రెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ విధానాన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు. అదే సమయంలో ట్రిపుల్ ఐటీతో సహా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తిరిగి వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడం వల్ల హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సాఫ్ట్ వేర్ సంస్థలు వేలిశాయన్నారు. పీ4 వంటి విధానాలతో 2047 నాటికి భారతదేశం ప్రపంచ నెంబర్ 1 లేదా నెంబర్ 2 దేశంగా నిలుస్తుంది.