“ఉగ్ర” గడపకు “సింధూర్”

IMG 20250507 WA0010

పాకిస్థాన్ ఉగ్ర అడ్డాల పై భారత సైన్యం జరిపిన మెరుపు దాడులు వ్యూహాత్మకంగా జరిగాయి. ఆపరేషన్ “సిందూర్” ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు.

Screenshot 20250507 165834 Chrome

పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మాట్లాడారు. మరో వైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలన్నారు.

రాఫెల్ ఎటాక్..

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాలపై భారత్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. అర్ధరాత్రి రాఫెల్ జెట్లతో విరుచుకుపడింది. భారత్ అత్యంత చాక చక్యంగా వ్యవహరించి కేవలం ఉగ్రస్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఎటాక్ చేసింది. తాజాగా ఈ ‘ఆపరేషన్ సిందూర్’పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ సీమంతర ఉగ్రవాదంలో 350 మంది భారతీయులు మృతి చెందారు, 800కి గాయాలయ్యాయి. 600 సైనికులు మృతి చెందారు. 1400 మంది సైనికులు గాయపడ్డారు. ఇకపై ఇలాంటివి ఉండ కుండా ఉండేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టిఆర్ఎఫ్) బాధ్యత తీసుకుంది. పాక్ ఉగ్ర సంస్థల కోసం టీఆర్ఎఫ్ పనిచేస్తుంది. టీఆర్ఎఫ్ ద్వారా ఎల్ఈటీ దాడులను భారత్ లో కొనసాగిస్తోందని అన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడిన వారిని గుర్తించినట్టు తెలిపారు.

Screenshot 20250507 143236 WhatsApp

అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోంది. భారత్ పై రానున్న రోజుల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రసంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ జరిగిందని విక్రమ్ మిస్రీ అన్నారు. ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రారంభమైంది. 1.30 నిమిషాలకు ముగిసిందని తెలిపారు. ఆ 25 నిమిషాల వ్యవధిలోనే తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందని చెప్పారు.ఈ ఆపరేషన్ లో పాక్ లోని టెర్రర్ ఇండక్షన్ లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేశామని తెలిపారు. అప్జల్ కసబ్ కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ దాడులు చేశామని సోఫియా ఖురేషి చెప్పారు. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మాట్లాడుతూ “పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు, వారి కుటుం బాలకు న్యాయం చేయడా నికి భారత సాయుధ దళా లు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశారు. పౌర, మౌలిక సదుపాయా లకు నష్టం జరగకుండా, పౌరుల ప్రాణాలను కోల్పోకుండా ఉండటానికి ఈ ప్రదేశాలను ఎంపిక చేసినట్టు చెప్పారు.

IMG 20250507 WA0008

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *