భారత్ “బాహు”శక్తి…

IMG 20250507 WA0047

అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ ర్యాంకులో ఉంది. భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది. 4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతో పాటు మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. భారత వాయుసేన దగ్గర 3 లక్షల10 వేల మంది బలగం ఉంది. 2,229 విమానాలున్నాయి.

images 14

వీటిలో 513 ఫైటర్ విమానాలు కాగా, 270 రవాణా విమానాలు. 130 అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 351 శిక్షణ విమానాలు, ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. భారత సైన్యానికి చెందిన మూడు విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లున్నాయి. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు. భారత నౌకాదళం దగ్గర లక్షా 42 వేలమంది సెయిలర్లు ఉన్నారు. రెండు విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలున్నాయి. వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్‌మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి. భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్‌పోర్టులు, 56 పోర్టులు ఉన్నాయి. ఏ కోణంలో చూసినా భారత బాహుబలి శక్తిని కలిగి అమ్ముల పొదిలో అన్ని హస్త్రాలతో సిద్ధంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *