జమ్మూ టార్గెట్‌గా పాకిస్థాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు భారత్ ఎస్-400 సుదర్శన్ చక్ర, ఎల్-70, జెడ్.ఎస్.యు -23. శిఖ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇండియన్ ఆర్మీ యాక్టివేట్ చేసింది. దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు రక్షణ శాఖ మంత్రి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుంచి పాకిస్థాన్ దొంగ చాటు దాడులను తీవ్రతరం చేసింది. దీనికి ధీటుగా బదులు చెప్పడానికి భారత సైన్యం కూడా సన్నద్ధం అయింది.
“సుదర్శన్” యాక్టివేటెడ్..
