కర్ణాటక విద్యాశాఖలో వింత వివాదం తలెత్తింది. అందాల తార తమన్నాను గురించి పాఠ్యాంశంలో చేర్చడం రచ్చగా మారింది. బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, నటుడు రణ్ వీర్ సింగ్ ల గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులున్నారని, సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే, సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించారని, అందుకే ఆమె గురించి పాఠ్యాంశంలో చేర్చామని స్కూలు యాజమాన్యం వివరణ ఇస్తోంది.