అరుదైన “అడవి దున్న”

IMG 20240703 WA0043

నల్లమల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇప్పుడు మళ్లీ కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని గుర్తించారు. అటవీ అధికారులు వెంటనే వీడియో, ఫొటోలు తీసి విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్ లో తాజా అడవిదున్న కనిపించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత అడవిదున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు. పెద్దపులులు, ఏనుగులు వంటి భారీ జంతువుల సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణమే కానీ ఈ అడవి దున్న మైదానా న్ని, దాటుకుని నల్లమలకు చేరి ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *