నేతల రాజకీయం, పలుకుబడి, పంతాల మధ్య ఒక సర్కిల్ పోలీస్ స్టేషన్ ఏకంగా మూడు ముక్కలు అయ్యింది. అది పరిపాలన సౌలభ్యం కోసం మాత్రం కాదు. నాయకుల పెత్తనం, వారి పలుకుబడి కోసం మాత్రమే. ఆ పోలీసు సర్కిల్ పరిధి అది మూడు నియోజక వర్గాల్లో విస్తరించి ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందుకే అందువల్లనే ఇప్పుడు మూడు నియోజక వర్గాల నేతలు ఆ సర్కిల్ ను పంచేసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల పరిస్థితి మూడు ముక్కల ఆటగా మారింది. ఈ సర్కిల్ ఖమ్మంను ఆనుకుని ఉన్నప్పటికీ దాని పరిధి మాత్రం మూడు నియోజకవర్గాలకు విస్తరించి ఉంది. పాలేరు నియోజవర్గంలోని ఖమ్మం రూరల్ సర్కిల్ మూడు నియోజకవర్గాల్లో పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో ఉంది.అదే దానికి శాపంగా మారింది. మూడు నియోజకవర్గాల్లో ఆ సర్కిల్ ఉన్నప్పటికి అక్కడ సర్కిల్ అధికారిగా మాత్రం పాలేరు ఎంఎల్ ఎ లేదా అక్కడకు ప్రాతినిద్యం వహిస్తున్న వారు చెప్పిన వారికే పోస్టింగ్ లు వస్తాయి. ఆ ఎంఎల్ఎ కు మాత్రమే అనుకూలంగా ఉండడం ఆనవాయతీగా మరుతోంది. ఇది మిగిలిన రెండు నియోజకవర్గాల్లో ఉన్న నేతలకు సమస్యగా మారుతొందనే వాదనలు ఉన్నాయి. దీంతో మిగతా నియోజకర్గాల వారు మాత్రం తెలివిగా తమ పోలీసు స్టేషన్ లను విడదీసి వాటిని సర్కిల్ గా అంటే ఇండిపెండెంట్ ఎస్ ఎచ్ ఓ లుగా మార్చేసుకోవడం గమనార్హం.
నాదంటే నాదంటూ…
అంటే అవి సర్కిల్ నుంచి విడివడి ఎస్ ఎచ్ ఓ లు గా ఉంటాయి. అందులో ఒక్క సర్కిల్ ఇన్స్ పెక్టర్, అదేవిదంగా ఇద్దరు ఎస్ ఐ లు ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఇలా ఎస్ ఎచ్ ఓ లు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ తరహా స్టేషన్ లు కార్పోరేషన్ లు, మున్సిపాలిటీల్లో ఉంటాయని వివరిస్తాయి. కానీ, ఇప్పుడు రూరల్ పోలీసు స్టేషన్ లను ఇలా రాజకీయ నాయకులు తమకు అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.ఈ సర్కిల్ పై పాలేరు ఎంఎల్ఎ ఆధి పత్యంలో ఉంటుంది. ఆయన చెప్పిన వారికే అక్కడ పోస్టింగ్ లు వస్తాయనే ఆరోపణలు ఉన్నాయి .రూరల్ పోలీసు స్టేషన్ తో పాటుగా రఘునాధ పాలెం, ముదిగొండ పోలీసు స్టేషన్ లు ఉన్నాయి. కానీ, ఈ మూడు ఇప్పుడు కార్పోరేషన్ లో కాని, మున్సిపాలిటీలో పరిధిలో గానీ లేవు. అయినప్పటికి ఇప్పుడు మూడు ఎస్ ఎచ్ ఓ లు గా మారిపోయాయి. దీనికి రాజకీయ ఒత్తిడులే కారణమని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్ లో ఉన్న రఘునాధ పాలెం స్టేషన్ నిన విడగొట్టారు. అప్పట్లో పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నప్పటికి రూరల్ పోలీసు స్టేషన్ నిర్వహణ మొత్తం ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి చేతుల్లో ఉండేది. దీంతో పాలేరు ఎంఎల్ఎ చెప్పిన వారికే రూరల్ సిఐ పోస్టింగ్ దక్కేది. దీంతో ఈ స్టేషన్ కి పాలేరు చేతిలో నుంచి విముక్తి చేయడానికి అనుకుంటా పువ్వాడ అజయ్ కుమార్ రఘునాధ పాలెం ను సపరేట్ ఎస్.ఎచ్.ఓ.గా మార్పించారనే వాదనలు బహిరంగంగా వినిపించాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారినప్పటికీ అదే పొలిటికల్ రగడ ఏర్పడింది. ఇప్పడు మధిర నియోజకవర్గంలోని ముదిగొండ ను రూరల్ సర్కిల్ నుంచి విడదీసి ఎస్ ఎచ్ ఓ గా ఏర్పాటు చేశారు. ముదిగొండ కు గత ప్రభుత్వంలో మధిర లో పని చేసిన సిఐ ని నియమించేశారు. ఇదంతా రోజుల వ్యవధిలో జరిగిపోయింది. దీన్నిబట్టి చూస్తే మూడు నియోజకవర్గాల్లో ఉన్న రూరల్ సర్కిల్ ఇప్పుడు మూడు నియోజకవర్గాలకు విడిపోయింది. అంటే నేతల పలుకుబడి ఒక సర్కిల్ ని ముడుముక్కలు చేసిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆయా నేతలు ఎవరికి వారు విడివిడిగా ఆధిపత్యం చెలాయించుకోవడానికి మార్గం సుగమమైంది.