అత్యధిక జాతీయులు పాల్గొన్న సెషన్‌గా ఈ యోగా చరిత్ర సృష్టించింది. ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్‌ను అందుకుంది. ఈ యోగా కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందినవారు పాల్గొనడమే కారణం. ప్రవాస భారతీయులతో పాటు ఆఫ్రికన్, అమెరికన్, కెనడియన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, జాతులు, తెగలకు చెందిన వారు యోగాలో పాల్గొన్నారు. ఒక కార్యక్రమంలో 135 దేశాల నుంచి పాల్గొనడం ఇప్పటివరకు ఎక్కడా చోటుజరగలేదు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు. యోగా ముగిసిన తరువాత ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను అందించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మోదీ హర్షం వ్యక్తం చేశారు.