తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర దీపం మహానగరానికి మరో మణిహారం. సుమారు 3.29 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 177 కోట్ల రుపాయల వ్యయంతో నగరం నడిబొడ్డున ఈ నిర్మాణం కొలువై ఉంది. ఒకవైపు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఇంకోవైపు చూడ సొంపుగా కనిపించే నూతన సచివాలయం, ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహం, నెక్లెస్ రోడ్డులకి చేరువలో ఉండడంతో అమర దీపం పర్యాటకులను మరింతగా ఆకాశించే అవకాశం ఉంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మించి గాని, బూర్గుల రామకృష్ణారెడ్డి భవనం, బిర్లా మందిర్ ఎక్కడి నుంచి చుసిన కనువిందు చేస్తుంది. ఈ స్మారకంలోని విశాలమైన హాలులో త్యాగమూర్తుల చిత్రపటాలు కొలువుదీరనున్నాయి. ఆరు అంతస్తులు ఉండే ఈ స్మారక భవనంలో 70 సీట్ల మినీ థియేటర్, ఒక సమావేశ మందిరం, రూఫ్ టాప్ రెస్టారెంట్ లను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్టీల్ ని వినియోగించిన కట్టడంగా భావిస్తున్నారు. భూమి నుంచి సుమారు 147 అడుగుల ఎత్తున నిత్యం అమరదీపం (జ్యోతి) వెలుగులు చిందుతుంది.