భారత్ లో మరో రెండు నగరాల్లో అమెరిక దౌత్య కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. బెంగళూరు, అహ్మదాబాద్ లలో ఈ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి అధికారులు నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.