భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా పర్యటనలో అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్‌కి చేరుకున్న మోడీకి జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధిపతులు పరస్పర రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, నిబంధనల మేరకు పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, రఘువీరారెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి మధుకర్ రెడ్డి, సుధాకర్ గట్టు, తెలంగాణ డెవలపర్ ఫోరం మాజీ అధ్యక్షుడు మురళీ చింతలపాణి తదితరులు సౌత్ లాన్‌లో వద్ద మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు.