
తొమ్మిది మంది మృతి
హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో సోమవారం ఉదయం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని తొమ్మిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మరికొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు…