Farm house
“దొర” అడుగు పెట్టరా..?
రాష్ట్ర శాసనసభ సమావేశాలు అంటే ప్రజలకు అనేక ఆశలు ఉంటాయి. అందులో బడ్జెట్ సమావేశాలంటే మహా ప్రత్యేకం. ఈ బడ్జెట్ లో తమకు ఆమోదయోగ్యం కాని కేటాయింపులు, పథకాల పై ప్రశ్నించే గొంతుక కోసం వేచి చూస్తారు. అదే అధికార, ప్రతిపక్షాల మేళవింపు శాసనసభ. బలమైన అధికార పక్షం సభ ముందు ఉంచే అంశాలను అధ్యయనం చేసి తప్పు, ఒప్పులను ఎత్తిచూపాల్సిన నైతిక బాధ్యత ప్రతిపక్షానిది. కానీ తెలంగాణలో జరుగుతున్న తంతు విచిత్రంగా ఉంది. పదేళ్ల పాటు…
“రాజద్రోహ” వ్యూహం..!
ప్రజల సమ్మతి, వారి ఆకాంక్షల మధ్య అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయడం నిజంగా రాజ ద్రోహం కిందికే వస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతలు చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు తెలంగాణ ప్రజలను విస్తుపరుస్తున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరతారని, ఇప్పటికీ 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో బేరసారాలు…