
“గులాబీ” పై “కాషాయం”మోజు..!
అయ్యో ఇదెక్కడి లొల్లి.. కెసిఆర్ బిడ్డ కవితక్క అలక బడితే తెలంగాణ సంగతేమో గానీ అటు దుబాయిలో బుర్జ్ ఖలీఫా బోసిబాయే… ఆస్ట్రేలియాలో “బతుకమ్మ” సతికిలబడే.. న్యూజిలాండ్ లోనూ గులాబీ “కివీస్” చిన్నబోయే…మొత్తంగా అక్క తిరిగిన అన్ని చోట్లూ అయోమయం… గందరగోళంగా మారిపోయే… పదేళ్లుగా అన్న, చెల్లెళ్ళు కలిసి సరదాలు, సంబురాలు చేసిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఇదే వింత పరిస్థితి… ఉద్యమ పార్టీ కుటుంబంలో రాజుకున్న కలహాల వేడి ఇంత కాలం గులాబీ గుబాళించిన విశ్వం…