తెలంగాణ పోలీసులకు ఫిక్కి స్మార్ట్ పోలీసింగ్ అవార్డు దక్కింది. ప్రకాష్ సింగ్, జాతీయ భద్రతా సంస్థ మాజీ డిప్యూటీ అరవింద్ గుప్తా, మంజీరి జరుహార్ చేతుల మీదుగా సిఐడి చీఫ్, రాచకొండ మాజీ సీపీ మహేశ్ భగవత్ అవార్డు అందుకున్నారు. పిల్లల భద్రత విభాగంలో వర్క్‌సైట్ స్కూల్ కార్యక్రమానికి ఈ అవార్డు లభించింది.

2017 – 2022 మధ్య ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నవారి ఒడియా, మరాఠీ భాషల్లో వర్క్‌సైట్ స్కూళ్ల ఏర్పాటుచేసి, సుమరు 6,555 మంది వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన అందేలా చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ సంస్థల నుంచి వచ్చిన 117 ఎంట్రీల్లో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉత్తమమైనదిగా ఫిక్కీ పేర్కొంది.
