రగులుతోంది….

పారిస్‌ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో  నాలుగు రోజుల కిందట ఫ్రాన్స్ లో ఒక్కసారిగా నిరసన జ్వాలలు  భగ్గుమన్నాయి. పారిస్‌ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్‌ స్టాప్‌ వద్ద  నహెల్‌ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా పారిస్‌ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్‌ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు,…

Read More

దారుణం….

సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు  తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆంధ్ర ప్రేదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. సచివాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు ట్రోల్ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై  అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన…

Read More

“బర్డ్” సేవలు…

 ప్రపంచ   స్థాయి వసతులతో అభివృద్ధి చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బాలాజీ వికలాంగుల శాస్త్ర చికిత్స పునరావాస కేంద్రం (బర్డ్) అనేక క్లిష్టమైన సర్జరీలకు రెఫరల్ ఆసుపత్రిగా మారుతోందని టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి వెల్లడించారు. “బర్డ్“ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ స్థాయి ఆర్థో ప్లాస్టీ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సమ్మిట్‌లో 10 నుంచి 12 దాకా మాత్రమే లైవ్ సర్జరీలు చేస్తుండగా బర్డ్ ఆధ్వర్యంలో తొలిసారి…

Read More

చంద్రయాన్-3…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మహా ప్రయోగానికి  సిద్ధమైంది. చంద్రుని పై దిగే స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్-3 మిషన్ రూపొందించారు. వచ్చే నేల 13 వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగించనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి.

Read More

ఏం జరుగుతోంది…

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద లైంగిక దాడి ఆరోపణలు చేసిన షేజాల్ జూబ్లీ హిల్స్ రోడ్ 36లోని దసపల్లా హోటల్ జంక్షన్ వద్ద నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. ఎంత వాదించినా తనకు న్యాయం జరగదంలేడనే మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

ఏమిటీ దుస్థితి…

గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ ‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ పేరుతో ఉన్న ఓ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆస్పత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఫొటోతో పాటు.. కొత్త భవన నిర్మాణానికి జాయింట్ అసోసియేషన్ విడుదల చేసిన లేఖకు సంబంధించిన ఫొటోలు ట్వీట్‌కు జత…

Read More
Logo site 9

ఆ ముగ్గురు ఎక్కడ…

గాజువాకలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు (జూన్ 24 శనివారం) నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు కాలేజీ నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. వీరిలో పిల్లా దిలీప్, యు. దంతేశ్వర్ (బాబీ), గండ్రెడ్డి ఉమేష్ పవన్ ఉన్నట్టు సమాచారం. ఈ ముగ్గురు యువకులు చదువుపై శ్రద్ధ చూపించక పోవడంతో తల్లిదండ్రులు మందలించారని, ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.పోలీసులు తెలిపిన…

Read More
jak ma

నేపాల్ లో “ఆలీబాబా”..

ఆలీబాబా గ్రూపు అధినేత, చైనా బిలియనీర్ జాక్ మా వ్యక్తిగత పర్యటనలో భాగంగా నేపాల్ వచ్చారు. ఢాకా మీదుగా వచ్చిన ప్రత్యెక విమానంలో అయన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కి చేరుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, నేపాల్ లు కేంద్రంగా పనిచేస్తున్న దార్జ్ అనే ఈ -కామర్స్ కంపెనీని ఇటివలే ఆలీబాబా సొంతం చేసుకుంది. నేపాల్ ప్రధాన మంత్రి పుష్పా కమల్ ధల్ తో అయన సమావేశమవుతారు.

Read More
pet land 1

ఇదెక్కడి న్యాయం…

ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు, నాయకులు, మంత్రుల  పొంతన లేని సమాధానాల వల్ల జర్నలిస్టులు రోడ్దేక్కే పరిస్థితికి దారి తీస్తోంది. ఇన్నేళ్ళు సుప్రీం కోర్టులో ఉన్న విచారణలను బూచిగా చూపిన వాళ్ళు కోర్టు తీర్పు వచ్చి పదినెలలు అవుతున్న దాని అమలుకు రోజుకో మాట చెప్పడాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ సభ్యులు తీవ్రంగా గర్హిస్తున్నారు. అంతేకాక, ప్రభుత్వ వైఖరి వల్ల సొసైటి సభ్యులు తమకు న్యాయం చేయించాలని రాజకీయ పార్టీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాదు, ఢిల్లీలో…

Read More
nursing cf

ఎన్నికలు ఎందుకు జరపరు….

రాష్ట్రంలో మెడికల్ కౌన్సిల్ కు  ఎన్నికలు జరుపుతున్నట్టే  నర్సింగ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికలను జరపాలని తెలంగాణ నర్సింగ్ సమితి  డిమాండ్ చేస్తోంది. నర్సింగ్ కౌన్సిల్ ఏర్పడి దాదాపు 52 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్కసారి కూడా ఎన్నిజలు జరపకపోవడం పట్ల సమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొందరు తమ స్వప్రయోజనాల కోసం కావాలనే ఎన్నికలను అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించింది.ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఏర్రోళ్ళ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ…

Read More
tdp

“నాలుగేళ్ల నరకం”

‘ “నాలుగేళ్ల నరకం” అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేర పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ “నాలుగేళ్ల నరకం”…

Read More