ఎన్నికలు ఎందుకు జరపరు….

nursing cf
nursing c

రాష్ట్రంలో మెడికల్ కౌన్సిల్ కు  ఎన్నికలు జరుపుతున్నట్టే  నర్సింగ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికలను జరపాలని తెలంగాణ నర్సింగ్ సమితి  డిమాండ్ చేస్తోంది. నర్సింగ్ కౌన్సిల్ ఏర్పడి దాదాపు 52 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్కసారి కూడా ఎన్నిజలు జరపకపోవడం పట్ల సమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొందరు తమ స్వప్రయోజనాల కోసం కావాలనే ఎన్నికలను అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించింది.ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఏర్రోళ్ళ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా నర్సింగ్ కౌన్సిల్ లో వాళ్ళ సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఓటు హక్కును కలిగి ఉన్నారని, కానీ కౌన్సిల్ లో ఓటు హక్కు ఉండనే విషయం చాల మందికి తెలియక పోవడం విచారకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత  కూడా   అనేక మంది నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ లు గా పని చేసినా,  ఏ ఒక్కరూ ఎన్నిక హక్కు విషయాన్ని తెరపైకి తీసుకురాలేదని సమితి వివరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికల వ్యవహారంలో రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని నర్సింగ్  కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసినా  వాటిని అమలు చేయక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. నర్సింగ్  కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని వైద్యాఆరోగ్య శాఖ మార్చి నెలలో 10713/G/2022-2 నెంబర్ మెమో జారీ చేసినా పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. కౌన్సిల్  ఏర్పడిన 1964 వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చట్ట పరంగా జరగాల్సిన ఎన్నికలు ఎందుకు నిర్వహించాలేకపోతున్నారో ప్రభుత్వం, సంబంధిత అధికారులు చెప్పాలని నర్సింగ్ సమితి  డిమాండ్ చేసింది. ఎన్నికలు నిర్వహిస్తే వృత్తి పరమైన సమస్యలను సులువుగా పరిష్కరించుకోవడమే కాకా, పలు రకాల అభివృద్ధి చేపట్టే అవకాశం ఉందని సమితి అభిప్రాయ పడింది. ఈ నెలలో జరిగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలతో పాటే నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు కూడా  జరపాలని ప్రభుత్వాన్ని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *