భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మహా ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రుని పై దిగే స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్-3 మిషన్ రూపొందించారు. వచ్చే నేల 13 వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగించనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి.