“నాలుగేళ్ల నరకం”

tdp

‘ “నాలుగేళ్ల నరకం” అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేర పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ “నాలుగేళ్ల నరకం” కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం దాదాపు నెల రోజుల పాటు సాగనుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *