రెండు సార్లు ఎం.ఎల్.ఎ.గా గెలిచినా వ్యక్తి గ్రామానికి చెందినా భూమిని కబ్జా చేయడం పెద్ద తప్పిదమే అని తన తండ్రి ఐన జనగాం సిట్టింగ్ ఎం.ఎల్.ఎ. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి వ్యాఖ్యానించారు. చేర్యాల గ్రామంలో తన తండ్రి భూమిని కబ్జా చేసి తనకు తెలియకుండానే దాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. అసలు విషయం తెలిసిందని గ్రామానికి చెందాల్సిన భూమి తనకు అవసరం లేదని, దాన్ని తిరిగి చేర్యాల మునిసిపాలిటికే అప్పజేప్పుతున్నట్టు భవాని వివరించారు. ఆ డాక్యుమెంట్లను కోర్టు ద్వారా అధికారులకు అడజేయనున్నట్టు చెప్పారు.
నాకేమొద్దు…
