“వ్యూహం” పేరుతో దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ బయోపిక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇప్పటికే జగన్ ని వర్మ రెండు సార్లు కలిసినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే విడుదలైన “వ్యూహం” టీజర్, మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. ఈ మూవీలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ని వర్మ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో పీఆర్పీ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను చూపించారు. వ్యూహం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు షూటింగ్ పూర్తి కాగా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అయితే, తాజాగా వర్మ మరో కాంట్రవర్సియల్ స్టిల్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేలా ఓ పిక్ ని పోస్ట్ చేశారు. ఈ ఫోటో పవన్ కళ్యాణ్ అభిమానులను కొంత రెచ్చగొట్టేదిగా ఉంది. పవన్ ని పోలిక ఒక వ్యక్తి నేలపై పడుకొని గాలిలో లెక్కలు వేస్తున్నాడు. తెల్లని వస్త్రాలు, మెడలో ఎర్ర కండువాతో ఉన్న సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని సినీ ప్రియులు, రాజకీయ నేతలు ఎలా తీసుకుంటారో చూడాలి.
