ఆస్ట్రేలియాలో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు.బ్రిస్బేన్ నగరంలో ఆమెకు భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన స్వాగతం పలికారు. సిడ్నీ, మెల్బోర్న్ నగరాల నుండి బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు వచ్చారు. తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అందెం, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, భారత జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షులు కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించి రెడ్డి, ఇతర నాయకులు ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. బ్రిస్బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న బోనాలు వేడుకల్లో కవిత, ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు పాల్గొంటారు.