పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ జాతీయ రహదారి పిల్లర్ నంబర్ 55 డెకత్లాన్ ఎదురుంగా స్వదేశీ హోటల్ లో బూజు పట్టిన జున్ను పెట్టడం వివాదంగా మారింది. హోటల్ కు వెళ్ళిన ఒక కుటుంబం జున్ను ఆర్డర్ చేసింది. తినే సమయంలో పరిశీలించగా అందులో ఒక పురుగు, బూజు కనిపించింది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కస్టమర్ ల సహాయంతో యజమాన్యాన్ని, సిబ్బందిని ప్రశ్నిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా బెదిరించారు. విషయం తెలిసిన మీడియా అక్చికడికి వెళ్వళడంతో దిగివచ్చి యాజమాన్యం, సిబ్బంది ఈ ఒక్కసారి క్షమించమని కోరడంతో చేసేది లేక ఆర్డర్ చేసిన వారు వెళ్ళిపోయారు. కానీ, హోటల్ లో ఇలాంటి పదార్ధాలు ఉన్న ఆహార కల్తీని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.