ధర్నా షురూ…

jnj dharna ramchn
jnj dharna 1 1

ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన పోరాట స్థలి “ధర్నాచౌక్”. ప్రభుత్వాలతో విసిగి వేసారిన అనేక ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసనలకు నీడనిచ్చిన మహా స్థలం “ధర్నాచౌక్”. ఇక్కడ జరిగిన వేలది కార్యక్రమాలను ప్రజలకు చూపాలనే తపనతో పగలనక ,రేయనక పనిచేశారు కలం వీరులైన విలేకరులు. ఇప్పుడు వారికే సమస్య వచ్చింది. ఆ సమస్య సాధన కోసం చేపట్టిన పోరాటానికి వేదికగా “ధర్నాచౌక్”నే ఎన్నుకున్నారు. అదీ ఈ రోజే.. అంటే జులై 18. న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. దీనికి దాదాపు అన్ని రాజకీయ, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్  సహా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ఉద్యోగ, విద్యార్థి సంఘాలను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలు సంఘీభావం తెలిపాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వమూ, అధికారులు నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరించడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తం అవుతొంది. ఈ మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లు రవి (టిపిసిసి సీనియర్‌ ఉపాధ్యక్షులు), వి.హనుమంతురావు (పిసిసి మాజీ అధ్యక్షులు), పొన్నాల లక్ష్మయ్య (పిసిసి మాజీ అధ్యక్షులు), మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (మాజీ ఎంపి), పొన్నం ప్రభాకర్‌ (మాజీ ఎంపి),ఈటల రాజేందర్ (బిజేపి రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌), రాంచంద్రరావు (మాజీ ఎమ్మెల్సీ), గీతా మూర్తి (బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు), ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి (బిజెపి మాజీ ఎమ్మెల్యే), యమునా పాఠక్‌ (బిజెపి అధికార ప్రతినిధి), రాణి రుద్రమారెడ్డి (బిజెపి అధికార ప్రతినిధి), కె.దిలీప్‌ కుమార్‌ (మాజీ ఎమ్మెల్సీ), బూర నర్సయ్య గౌడ్‌ (మాజీ ఎంపీ), డి.జి. నర్సింహరావు (సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు), నంధ్యాల నరసింహారెడ్డి (సిపిఎం, మాజీ ఎమ్మెల్యే), కోమటి రవి (సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు), కూనంనేని సాంబశివరావు (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (బిఎన్‌పి రాష్ట్ర అధ్యక్షులు), ప్రొఫసర్‌ కొదండరాం (టిజేఎస్‌-రాష్ట్ర అధ్యక్షులు), బలాల్‌(ఎంఐఎం), పాషా ఖాద్రీ (ఎంఐఎం), గట్టు రాంచద్రరావు (వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి), రాములు గౌడ్ (ఆప్‌ పార్టీ ), ఆర్‌ క్రిష్ణయ్య (వైసిపి ఎంపి), ప్రజాసంఘాల నేతలు ఇందిరా శోభన్‌, విమలక్క (అరుణోదయ్య సాంస్ర్కతిక మండలి), ప్రొఫసర్‌ హరగోపాల్‌, పిఓడబ్యూ సంధ్య, విద్యార్థి సంఘం నాయకులు ఝాన్సీ, కరుణాకర్‌ (ఏబివిపి), లక్ష్మణ్‌ (ఏఐఎస్‌ఎఫ్‌ ), విఠల్‌ (ఉద్యోగ సంఘాల నాయకుడు), విరాహత్ అలీ (టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), బసవపున్నయ్య (టీడబ్య్లూజేఎఫ్) తదితరులు పాల్గొంటారని ధర్నా నిర్వాహక కమిటి తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *