image

ఎందుకీ నిర్లక్ష్యం…

అనలోచిత నిర్ణయాల వల్ల చేతికందుతుందనుకున్న ఫలాలు దక్కని పరిస్థితి నెలకొంది. ఒకే సంఘంలో భిన్నాభిప్రాయాలు సభ్యుల భవిష్యత్తును, ఆశలను వేదనకు గురి చేస్తున్నాయి. డబ్బు చెల్లించి  దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుకు ఆ భూములు ఇవ్వండని సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యుల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడం ఆ సొసైటిలోని సామాన్య సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది….

Read Full News
suprime

ఇదెక్కడి న్యాయం…!

హైదరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమి వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పేట్ బషీరాబాద్ లో  గత ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి బదలాయించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అంతేకాక్, ఈ నెల 6 తేదిన సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న పరిణామం అంతుపట్టకుండా ఉందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని…

Read Full News
20230703 135508

ఇది నిజమైతే…శుభవార్తే…!

హైదరాబాద్ జర్నలిస్టుల చిరకాల ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా  హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకరులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి లో సభ్యులకు 2007వ సంవ్సరంలో  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. నిజాం పేట్ ప్రాంతంలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాలు…

Read Full News
images 20

అక్కడ ముమ్మరం…ఇక్కడ నీరసం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు మంజూరు చేయాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యం విలేకర్లు, జర్నలిస్టు సంఘాలను అసంతృప్తికి గురి చేస్తోంది. డబ్బు చెల్లించి, 16 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పాత్రికేయులకు, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం వేచిచూస్తున్న వారికీ ప్రభుత్వం న్యాయం చేస్తామనే చెబుతోంది. కానీ, ఎప్పుడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.అయితే, ఇదే విలేకర్ల వర్గానికి జిల్లాల్లో మాత్రం స్థలాలు కేటాయించడం, వారికి మంజూరు చేయడం వేగంగా జరిగి…

Read Full News
image

డిల్లీలో ఏం జరుగుతోంది…..!

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి పై ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్థలంపై ఉన్న న్యాయపరమైన చిక్కులపై చర్చించడానికి సొసైటీ నేతలతో రాష్ట్ర రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ)లతో సోమవారం సమావేశం ఉన్నట్టు సొసైటీ కార్యదర్శి వంశీ తెలిపారు. ఇదిలా ఉంటే, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం సొసైటీకి అప్పజెప్పక పోవడతో ఈ నెల 10వ తేదిన నగరంలోని హెచ్ఎండిఎ…

Read Full News
pet land 1

ఈ అంశం కీలకం…!

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భుమిని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే ఆందోళనతో కొందరు సభ్యులు పిటిషన్ వేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ దాఖలు చేయడంలో…

Read Full News
Screenshot 2023 08 09 082232

డిల్లీలో ముమ్మరంగా…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్  సొసైటీకి 2007 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం  పేట్ బషీరా బాద్ లో కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడానే కార్యక్రమంలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన  కొందరు సొసైటీకి సభ్యులు అక్కడ రెండు రోజులుగా న్యాయ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించక పోవడంతో డిల్లీ లోని నిపుణుల అభిప్రాయాలు…

Read Full News
jnj vh

సున్నితత్వం ముఖ్యం…

రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇంటి స్థలాల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ సాధించుకొని పదేళ్ళు కావస్తున్నా ఆ పోరాటంలో ప్రత్యక్ష సాక్షులు , కలం వీరులైన విలేకరులను ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సమాజంలో బాధ్యత కలిగిన నాలుగో వర్గం (ఫోర్త్ ఎస్టేట్)గా ఉన్న జర్నలిజాన్ని , దాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అనే…

Read Full News
jnj members

అటు నిర్లక్ష్యం.. ఇటు నిస్సహాయత…

ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అసలు ఏం చేయలనుకుంటుందో తెలియని అయోమయం…. మరోవైపు ఈ సమయంలో చురుకుగా వ్యవహరించాల్సిన  హౌసింగ్ సొసైటీ  నత్త నడక పనులు…సమస్య పరిష్కారానికి సరైన ప్రయత్నాలు చేయకపోవడం ఇవ్వన్నీ కలిసి సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల్లోనే  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్  సొసైటీ  సభ్యుల మధ్య అగాధం పెరగడానికి దారి తీస్తోంది. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య సమన్వయ కర్తగా ఉండాల్సిన మీడియా అకాడమీ సైతం ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుకుతుందో బాహ్య…

Read Full News
ktr j

ఇదా సమాధానం…

హైదరాబాద్ లో ఏంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇళ్ళ స్థాసాలు మంజూరు చేయాలని శాసన సభలో కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. జంట నగరాల్లో అనేక మంది జర్నలిస్టులు సుప్రీం కోర్టులో కేసు నెగ్గి కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. శాసన సభ జీరో అవర్ లో జగ్గారెడ్డి ఈ మేరకు ప్రస్తావించారు. అయితే , దీనికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ఇచ్చిన సమాధానం…

Read Full News
contempt 1 1

అటు విజ్ఞప్తి…ఇటు ఆందోళన..

తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంజూరు చేయాలని కోరుతూ డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఈ రోజు శాసన సభలో పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ ని వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి జర్నలిస్టులకు తప్పని సారి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించనున్నట్టు తెలుపారు. ఇదిలా ఉంటే, తమకు న్యాయంగా దక్కాల్సిన భూముల విషయంలో ప్రభుత్వం అవలభిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల జవహర్ లాల్…

Read Full News
ktr

ఇళ్ల స్థలాల చర్చలు…

హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించే అంశాన్ని చర్చించడానికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అయినట్టు తెసిసింది. ఈ సమావేశంలో పెండింగులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత, కొత్త వారికి స్థలాల సేకరణ వంటి ప్రధాన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read Full News
jnj dharna ramchn

ధర్నా షురూ…

ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన పోరాట స్థలి “ధర్నాచౌక్”. ప్రభుత్వాలతో విసిగి వేసారిన అనేక ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసనలకు నీడనిచ్చిన మహా స్థలం “ధర్నాచౌక్”. ఇక్కడ జరిగిన వేలది కార్యక్రమాలను ప్రజలకు చూపాలనే తపనతో పగలనక ,రేయనక పనిచేశారు కలం వీరులైన విలేకరులు. ఇప్పుడు వారికే సమస్య వచ్చింది. ఆ సమస్య సాధన కోసం చేపట్టిన పోరాటానికి వేదికగా “ధర్నాచౌక్”నే ఎన్నుకున్నారు. అదీ ఈ రోజే.. అంటే జులై 18. న్యాయం కోసం ధర్నాకు…

Read Full News
dharna 1

పోరాటం ఆగదు…

జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్…

Read Full News
jnj 2

అక్కడ సరే..మరి ఇక్కడ…

వరంగల్ లో పని చేస్తున్న విలేకరులలో   ఏకశిలా, కాకతీయ హౌసింగ్ సొసైటీల్లో సభ్యులుగా లేని వారి నుండి జులై, 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో దరఖాస్తులు తీసుకోవాలని లో వర్కింగ్ జర్నలిస్టుల  స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ తెలిపింది.  వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం ఏర్పడిన  ఆరుగురు సభ్యుల కమిటీ  కాకతీయ, ఏకశిలా ఈరెండు సొసైటీల…

Read Full News