image

డిల్లీలో ఏం జరుగుతోంది…..!

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి పై ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్థలంపై ఉన్న న్యాయపరమైన చిక్కులపై చర్చించడానికి సొసైటీ నేతలతో రాష్ట్ర రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ)లతో సోమవారం సమావేశం ఉన్నట్టు సొసైటీ కార్యదర్శి వంశీ తెలిపారు. ఇదిలా ఉంటే, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం సొసైటీకి అప్పజెప్పక పోవడతో ఈ నెల 10వ తేదిన నగరంలోని హెచ్ఎండిఎ…

Read More
pet supr

నిర్లక్ష్యం విలువ…ధిక్కరణ మార్గం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల విషయంలో ప్రభుత్వం ఏ విషయాన్ని తేల్చక పోవడం సమస్యగా మారుతోంది. ముఖ్యంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడంలో అధికారుల నాన్చుడు ధోరణి సొసైటీ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ప్రభుత్వం ఒక్క జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల వ్యవహారంలోనే ఎందుకు స్తబ్దంగా వ్యవహరిస్తోందో అర్ధం…

Read More
jnj members

అటు నిర్లక్ష్యం.. ఇటు నిస్సహాయత…

ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అసలు ఏం చేయలనుకుంటుందో తెలియని అయోమయం…. మరోవైపు ఈ సమయంలో చురుకుగా వ్యవహరించాల్సిన  హౌసింగ్ సొసైటీ  నత్త నడక పనులు…సమస్య పరిష్కారానికి సరైన ప్రయత్నాలు చేయకపోవడం ఇవ్వన్నీ కలిసి సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల్లోనే  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్  సొసైటీ  సభ్యుల మధ్య అగాధం పెరగడానికి దారి తీస్తోంది. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య సమన్వయ కర్తగా ఉండాల్సిన మీడియా అకాడమీ సైతం ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుకుతుందో బాహ్య…

Read More
ktr

ఇళ్ల స్థలాల చర్చలు…

హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించే అంశాన్ని చర్చించడానికి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అయినట్టు తెసిసింది. ఈ సమావేశంలో పెండింగులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత, కొత్త వారికి స్థలాల సేకరణ వంటి ప్రధాన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read More
Screenshot 20230731 221120 Gallery 1

స్థలం ఎందుకు ఇవ్వరు…

ప్రభుత్వం పేట్ బషీరాబాద్ లో  కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సొసైటీ సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. ఈ నెల 10వ తేదీలోపు ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి సొసైటీ కి బదలాయించాలని, లేకపోతే హైదరాబాద్ లోని అన్ని హెచ్.ఎం.డి.ఎ. కార్యాలయాల ముందు నిరసనలకు దిగుతామని వెల్లడించింది. పేట్ బషీరాబాద్ స్థలంలో  జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది….

Read More
jnj 3 2

ఎవరేంటో తేలాలి…

ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ విలేకర్లు డబ్బు చెల్లించి మరీ ఎదురుచూస్తున్న ఇళ్ళ స్థలాలకు పరిష్కారం దొరుకుతుందా.. ఎంత పోరాటం చేసినా , దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం, అధికారులు ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు…దీని వెనుక ఎవరున్నారు ….అసలు జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ ఏం చేస్తోంది… అది ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతోందా… కమిటీ నాయకులలోనే కొందరు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారా, ఒత్తిడి తేలేక పోతున్నారా …జర్నలిస్టుల సదాక బాధకాలు చూడాల్సిన మీడియా అకాడమీ కూడా…

Read More
jnj hanumth ravi

స్థలం వాళ్ళదే ఇవ్వండి…

హైదరాబాద్ జర్నలిస్టుల న్యాయమైన ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ “ధర్నా చౌక్” వద్ద చేపట్టిన ధర్నా కు రాజకీయ పార్టిలు, ప్రజా సంఘాలు తరలి వచ్చాయి. కాంగ్రెస్ నేతలు వి. హనుమంత రావు, మల్లు రవి, బిజెపి నేతలు ఈటెల రాజేందర్, రామచంద్ర రావు, విమలక్క హాజరై జర్నలిస్టులకు అండగా నిలుస్తామన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి…

Read More
jnj dharna ramchn

ధర్నా షురూ…

ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన పోరాట స్థలి “ధర్నాచౌక్”. ప్రభుత్వాలతో విసిగి వేసారిన అనేక ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసనలకు నీడనిచ్చిన మహా స్థలం “ధర్నాచౌక్”. ఇక్కడ జరిగిన వేలది కార్యక్రమాలను ప్రజలకు చూపాలనే తపనతో పగలనక ,రేయనక పనిచేశారు కలం వీరులైన విలేకరులు. ఇప్పుడు వారికే సమస్య వచ్చింది. ఆ సమస్య సాధన కోసం చేపట్టిన పోరాటానికి వేదికగా “ధర్నాచౌక్”నే ఎన్నుకున్నారు. అదీ ఈ రోజే.. అంటే జులై 18. న్యాయం కోసం ధర్నాకు…

Read More
jnj17

రండి..కదలండి..

దశాబ్ధలుగా వేల సమస్యలపై వివిధ వర్గాలు చేపట్టిన పోరులో భాగంగా సాగిన ధర్నాలను వార్తలుగా మలిచి సమాజానికి అందించిన విలేకరులే అదే “ధర్నాచౌక్” లో నేడు న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా కలం వీరుల మహా నిరసన రేపే జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు…

Read More
jnj c 1

తీర్పును లెక్క చేయరా..

సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేసే దిశగా వ్యుహరచన చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా”…

Read More
dharna 1

పోరాటం ఆగదు…

జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి  పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీం కోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయడంలో అధికారులు, ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18 వ తేదిన ఇందిరా పార్క్ చౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్…

Read More