చెట్లకు నెంబర్లు…

tadi c
tadi in

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను వేయాలని ప్రోహిబిషన్ , ఎక్సైజ్ శాఖ పై రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాప్తంగా ఆగష్టు 31 లోగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను పూర్తి చేయాలన్నారు. తెలంగాణకు హరితహారం లో భాగంగా ప్రభుత్వ భూములలో తాటి, ఈత, ఖర్జూర , గిరక తాటి చెట్లను పెంచాలన్నారు. తాటి, ఈత, ఖర్జూర, గిరక చెట్లను నరికి వేసే వారిపై కనీసం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష , జరిమానలను విధించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీ లలో గౌడ కులస్తుల వృత్తిని ప్రోత్సహించడానికి కల్లు దుకాణాలను మంజూరు చేసి లైసెన్సు లను మంజూరు చేయాలని మంత్రి చెప్పారు. తాటి చెట్టు ఎక్కే ఆధునిక సేఫ్టీ యంత్రాల రూపకల్పనపై ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గీత కార్మికులకు సేఫ్టీ యంత్రాలను అందించాలన్నారు. ఈ సమావేశం లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గజ్జెల నగేష్, రాష్ట్ర ప్రోహిబిషన్ , ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మమ్మద్ ముషారఫ్ ఫారూకి, అదనపు కమిషనర్ అజయ్ కుమార్, జాయింట్ కమిషనర్ లు శాస్త్రి, ఖురేషీ, సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ లు చంద్రయ్య గౌడ్, శ్రీనివాస్, అనీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *