“జనసేన” తడబాటు…

prp logo
CHIRU
pawan kkd 1

పి.ఆర్.పి గుర్తుండే ఉంటుంది..అదే ప్రజారాజ్యం పార్టీ ..మెగాస్టార్ కలల సాకారం.. రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనే సంకల్పం. ఆనాడు ప్రజల్లో ఎన్నో ఆశలు రేపింది. అధికార పక్షానికి తానే పోటీ అని చాటింది. ప్రతీ  మీటింగ్ లో అశేష జనవాహినిని చూసి తబ్బిబ్బయింది. గెలుపు ఖాయమని అంచనా వేసింది. కొన్ని సందర్భాల్లో అధికారం మాదే అన్న నిర్ణయానికీ వచ్చింది. కానీ, అది మెగాస్టార్ పై అభిమానమే తప్ప ప్రజలు ఏలికను కోరుకోవడంలేదని ఎన్నికలు జవాబు చెప్పాయి.

sonia
modi 1 1

2008 వ సంవత్సరం అగుస్టు 26 తిరుపతిలో ఇసుకేస్తేరాలని జన సందోహం మధ్య జరిగిన సమావేశం “సినిమా” మాత్రమే అని తేలిపోయింది. ఆనాడే “చిరు”కి తెలుసో ఏమో ఒకటేందుకు అని  రెండు చోట్ల పోటీ చేశారు. సొంత ఊరు పాలకొల్లు ఓటర్లు నువ్వు మాకు కేవలం హీరోవే,  కానీ, నాయకుడివి కావు అంటూ ఓడించారు. తిరుపతి ప్రజలు మాత్రం ఏవో ఆశలతో గెలిపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 294 సీట్లకు గానూ 18 సీట్లు మాత్రం గెలుచుకుంది ప్రజారాజ్యం. అప్పట్లో  కేంద్రంలో అధికారంలోఉన్నది కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి అధికారంలోకి వచ్చింది వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి.  అనేక తర్జన భర్జనల తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రి కావడం, 2011 వ సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీన (పార్టీ స్థాపించింది కూడా ఆగస్టులోనే) అప్పటి రక్షణ శాఖ మంత్రి ఎ.కె. అంటోని ప్రతిపాదించగా సోనియా గాంధీ సమక్షంలో ప్రజారాజ్యం పార్టీని కాస్తా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి. ఆ తర్వాత ఎం జరిగిందో తెలుగు ప్రజలకు తెలియని వ్యవహారం కాదు.

janasna logo 1

ప్రస్తుతానికి వస్తే జనసేన. మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్  తెరపైకి తీసుకొచ్చిన మరో రాజకీయ పార్టీ.  2014వ సంవత్సరం మర్చి నెల 14వ తేదీన అట్టహాసంగా ఈ పార్టీని స్తాపించారు పవన్ కళ్యాణ్. చేగువేరా  సిద్ధాంతాలు, వ్యూహాలతో పుట్టుకొచ్చిన జనసేన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపికి వత్తాసుపలికింది. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి తెలుగుదేశం వంటి మరో ప్రాంతీయ పార్టీతో కలిసి ఒకే వేదికపై పాలుపంచుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజారిటీతో అధికరంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత  2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు 2018 మే నెలలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక్, భీమవరం రెండు నియోజక వర్గాలలోను ఓటమి చవి చూసారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావమో, రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానమో, లేక జనసేన వ్యూహాల లోపమో  కానీ ఆ ఎన్నికల్లో కేవలం  రాజోలు స్థానం నుంచి రాపాక వర ప్రసాద్ మాత్రమే గెలుపొంది అసెంబ్లీలో జనసేనకు ఒక్క సీటు కల్పించారు. అన్నచిరంజీవి అప్పట్లో కనీసం 18 స్థానాలనైన గెలుచుకున్నారు. తమ్ముడు ఏంటి ఒకటికే పరిమితమైయ్యాడనే ప్రశ్నలు, వాదనలు తలెత్తాయి.  ఇక  ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున తరుణంలో రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, జరగబోతుందో  చర్చించాల్సిన అవసరం ఉంది. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చుస్తే  చిరంజీవి ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీల మధ్య సారూ ప్యాం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అప్పట్లో  కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిరంజీవి ఏర్పాటు చేసిన  ప్రజారాజ్యం పార్టీని ఏకంగా తనలో విలీనం చేసుకుంది. 2014 ఎన్నికలు వచ్చే సరికి ఆ పార్టీ జాడ లేకుండా చేసింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే అప్పటికీ, ఇప్పటికీ కొంచం పోలికలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చర్చకి మొన్న ధిల్లీ లో జరిగిన ఎన్డీఏ సమావేశాన్నే ఉదాహరణగా చూపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశంని కాదని జనసేనని ఎందుకు ధిల్లికి పిలిచారనేది చర్చనీయాంశంగా మారింది.  రాజకీయ చాణక్యుడైన చంద్రబాబునాయుడుని కాదని పవన్ కళ్యాణ్ ని  బిజెపి ధిల్లీకి రప్పించడం వెనుక అంతరంగం పై ఆలోచిస్తున్నారు.  అంతేకాక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి తరచూ ధిల్లీ పర్యటనలకు వెళ్ళడం, అక్కడ ప్రధాని సహా బిజెపి అగ్రనేతలను కలిసి రావడం వంటి విషయాలతో బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీల రాజకీయ వ్యూహాలను బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అంతేకాదు, ఆ మధ్య చంద్రబాబునాయుడు కూడా బిజెపి నేతలను కలిసి రావడం సామాన్యులు, పరిశీలకులలో రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ తక్కువేమీ కాదనేది బిజెపి ధిల్లీ పెద్దలకు తెలియని విషయం కాదు.. అలాంటప్పుడు చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ ని ఎందుకు పిలిచారనేది తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జగన్ కి బిజెపికి పెద్దగా రాజకీయ విభేదాలు లేవు. ఆ రాష్ట్రంలో బిజెపికి ఉన్న బలం కూడా ఆశించినంతేమి కాదు. అలాంటప్పుడు చంద్రబాబుని కాదని పవన్ కళ్యాణ్ ని ధిల్లీకి ఆహ్వానించడం పై తాజాగా చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఈ ఆహ్వానం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అప్పుడు కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం పార్టీకి ఎదురైనా పరిస్థితులు, ఇప్పుడు బిజెపి నుంచి జనసేనకు ఎదురవుతాయా అనే సందేహాలకు తెర లేపుతోంది. ఒకవేళ అన్న మాదిరిగా తమ్ముడు కాదు కదా అనే బహిరంగ  చర్చలూ మొదలైయ్యాయి. రాష్ట్రంలో బలాన్ని పెంచుకుంటే బాగుంటుంది కానీ, బయటి పార్టీలతో కలవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనేది గతం స్పష్టంగా చూపింది.  ఒక లక్ష్యం తో జనలోకి వచ్చిన ప్రాంతీయ పార్టిలు జాతీయ పార్టీలతో అంటకాగడం  ఎంతవరకు సమంజసమనే వాదనలు తలెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *