పెట్టుబడికి బ్రేక్…

byc

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మోకాళ్ళడ్డింది. ఇప్పటికే నిధులు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బందులు కేంద్రం   కేంద్రం తాజాగా  రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.  అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన  బి.వై.డి. హైదరాబాదులో ఏర్పాటు చేయాలనుకున్న వాహన తయారీ విభాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. బివైడి సంస్థ నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బ్యాటరీలను కూడా తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి పేరు ఉన్నది. మన దేశంలోనూ బివైడి వాహనాల అమ్మకాలు భారీగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో రూ. 8 వేల కోట్లతో తమ పరిశ్రమ ఏర్పాటు చేసి ఏటా 10 నుంచి 15 వేల వాహనాలు తయారు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు  పెట్టుకున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ  అనుమతి నిరాకరించింది. ఈ పరిశ్రమను గుజరాత్ లో కాకుండా హైదరాబాదులో ఏర్పాటు  చేయలనుకోవాడం వల్లే కారణంతోనే అనుమతులు ఇవ్వలేదని వాదనలు వినిపిస్తున్నాయి. భారత్  ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటోంది. ఫలితంగా ధరలు కూడా అధికంగా ఉన్నాయి. అదే మన దగ్గరే వాహనాలు తయారైతే  ధరలు కూడా తగ్గే అవకాశం ఉందనేది పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఒకవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహకాల వినియోగాన్ని పెంచాలని చెబుతున్న కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడిదారుల్లో అసంతృప్తి పెంచుతున్నాయి. ఇప్పటికే సోలార్ ప్యానల్స్ పై జీఎస్టీని, దిగుమతి సుంకాన్ని భారీగా పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.   కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రిక్ వాహనాల పైన రాయితీలను  ఎత్తేసి , ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేందుకు రావాలనుకున్న సంస్థకు రెడ్ సిగ్నల్ వేయడం వెనుక అంతర్యం అర్ధం కావడం లేదని వాహన పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో కాలుష్యం ఉన్న 50 పట్టణాల్లో 39 పట్టణాలు మన దేశంలోనే ఉన్నాయని, ఆ పట్టణాలను కాలుష్యం నుంచి కాపాడుకునేందుకైనా కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు.

car in

ఇదిలా ఉంటే, తెలంగాణకు వచ్చే  పెట్టుబడులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డుకుంతోందని  తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. ఇది చాలా దుర్మార్గమని, ఒక రాష్ట్రం మీద ఉన్న కోపంతో పూర్తిగా దేశానికి చేటు చేసే నిర్ణయం తీసుకున్నదని వ్యాఖ్యానించారు.  వేలాదిమంది ఉపాధి అవకాశాలను దెబ్బతీసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని ఈవీ తయారీ సంస్థకు అనుమతులిచ్చి పర్యావరణ పరిరక్షణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *