ప్రకృతి సిద్ధమైన నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర పురపాలక , ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ పాయింట్ వద్ద కేకును కట్ చేశారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ అనేక ఔషధ గుణాలు కలిగిన నీరా సేవించడం వల్ల కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా కాపాడుతుందన్నారు. అనంతరం సైక్లింగ్ స్పోర్ట్స్ మీట్ ను క్రీడ ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, అర్జున అవార్డు గ్రహీత అనూప్, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ, మర్రి లక్ష్మారెడ్డి, ప్రేమ్ రాజ్ పాల్గొన్నారు. అందరూ కలిసి నీరా సేవించారు.