"నయా"గరా... - EAGLE NEWS

“నయా”గరా…

Screenshot 2023 07 23 154142

ములుగు-వాజేడు మండలంలో ఓ ప్రకృతి దృశ్యం వెలుగు చూసింది. అరుణాచలపురానికి కిలోమీటర్ దూరంలో అద్భుత జలపాతం బయటపడింది. ఇంత కాలం సన్నని ధారగా ప్రవహించిన ఈ జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలకు తన రూపు మార్చుకొని చూడ చక్కని జలపాతంగా మారింది. స్థానికులు దీన్ని గుండం జలపాతంగా పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ జలపాతం వద్ద నీరు సముద్రపు నీరు మాదిరిగా నీలి రంగులో ఉండడం విశేషం. అందుకే పర్యాటకులు మరి ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది. రెండు గుట్టల మధ్య నుండి జాలువారుతున్న ఈ చిన్న నయాగరాని వీక్షించడానికి పర్యాటకులు తరలివస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *