పోలీస్ స్టేషన్ లో శవం బయట పడి కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ లోనే శవం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్
పోలీసు స్టేషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారుల కోసం నిర్మించిన టాయిలెట్ లో శవం కనిపించే సరికి సిబ్భంది ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ వ్యక్తి చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తి వయసు 45 ఏళ్లు ఉంటుందని అంచనా చనిపోయిన వ్యక్తి ఎవరనేది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇక్క డికి వచ్చి నారోగ్యంతో చనిపోయాడా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయినా, పోలీస్ స్టేషన్ లో మూడు రోజుల నుంచి ఉంటున్న మృతదేహం విషయాన్ని పోలీసులే గమనించక పోవడం చర్చగా మారింది.
స్టేషన్ లోనే శవం…
