పట్ట పగలు…అత్యంత రద్దీ ప్రాంతం… నిత్యం వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ ని అదుపు చేయడానికి పోలీసులు సతమతమయ్యే ప్రదేశం భాగ్యనగరంలోని హైటెక్ సిటీ జంక్షన్. ఆ సెంటర్ ని పోకిరిలు తాగడానికి అడ్డగా మార్చుకున్నారు. ఏ డివైడర్ పక్కనో, గల్లీ లోనో కాదు ఏకంగా పోలీసులు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ బూత్ లోనే కావడం గమనార్హం. ఆ బూత్ నే అడ్డాగా మార్చుకొని ఇద్దరూ వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటున్న విషయం చర్చనీయంశంగా మారింది. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలున్నా అవి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిబ్బంది వీళ్ళ వ్యవహరాన్ని గుర్తించకపోవడం పోలీసులు ఉన్నాతాదికరులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అంత రద్దీ ప్రాంతంలో పోలీసులు ఎక్కడికి వెళ్ళారో విచారణలో బయటపడుతుంది.