ఇవ్వన్నీ చేస్తాం..

ktr 22

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా  సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది.  దాదాపు ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి పలు కీలక అంశాలను ఆమోదించింది. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటిఅర్ అధ్వర్యంలో పలువురు మంత్రులు విలేకర్లకు వివరించారు. రాష్ట్రంలో వదలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాల వల్ల  అనుహ్యరీతిలో వరదల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డవారికి రాష్ట్ర మంత్రి మండలి నివాళులర్పించింది, అనూహ్యరీతిలో అతిభారీ వర్షాలు, నష్టం నేపథ్యంలో రాష్ట్రంలో ముంచెత్తిన వరదల వలన కలిగిన నష్టాలను రెవెన్యూ శాఖ, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ తదితర శాఖలు వివరాలను కేబినెట్ కు వివరించాయి, కల్వర్టులు కొట్టుకుపోవడం, రోడ్లు పాడవడం వంటి ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతిన్నాయని తెలిపింది. ఇందుకుగాను రూ. 500 కోట్లు తక్షణ సాయం కింద విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించింది.  ఇక ఖమ్మం పట్టణాన్ని మున్నేరు నది వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడుగునా ఉన్న మున్నేరు నది వెంట ఆర్ సిసి తో గోడ,  ఫ్లడ్ బ్యాంక్ ను నిర్మించాలని కేబినేట్ తీర్మానించింది. ఆకాల వర్షాల వల్ల  పంట నష్టపోయిన రైతులు, మళ్లీ తిరిగి విత్తనాలు వేసుకునేందుకు అవకాశం ఉన్నందున, విత్తనాలు, ఎరువులను అదనంగా సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.  వర్షాలు,వరదల కారణంగా దాదాపు 40 మందికిపై చనిపోయారని, చనిపోయిన వారి వివరాలు సేకరించి వారికి రైతులకు అందే రైతుబీమా సౌకర్యాన్ని తక్షణమే అందించేందుకు చర్యలు చేపట్టాలని, రైతులు కానివారిని గుర్తించి వారికి ప్రభుత్వమే ఎక్స్ గ్రేషియా అందించాలని తీర్మానించింది. ఇదిలా ఉంటే, 69,100 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో మెట్రో రైల్ విస్తరణ పనులు చేపట్టాలని కూడా నిర్ణయించారు.

cabinet july 1

హైదరాబాద్ మెట్రో రైల్ ను నగరం నలుదిక్కులా విస్తరించనున్నారు.  రానున్న మూడు , నాలుగు ఏళ్లలో  పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణను పూర్తిస్థాయిలో చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో రైలు అథారిటిని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ (ఎంఎయుడి) శాఖను కేబినేట్ ఆదేశించింది.  ఫేజ్ త్రీ మెట్రో విస్తరణలో భాగంగా పార్ట్ ఏలో 8 ఎక్స్ టెన్షన్ మార్గాల్లో మెట్రో మార్గాలను విస్తరించాలని  నిర్ణయించింది, ఇందులో బీహెచ్ఈఎల్ నుంచి పటాన్ చెరు, ఓఆర్ఆర్, ఇస్నాపూర్ వరకు, 13కిలో మీటర్లు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ , పెద్ద అంబర్ పేట వరకు 13 కిలో మీటర్లు, శంషాబాద్ నుంచి కొత్తూరు, షాద్ నగర్ వరకు 28కిలో మీటర్లు, ఉప్పల్ ఓఆర్ ఆర్ ,ఘట్ కేసర్, బీబీనగర్ వరకు 25 కిలో మీటర్లు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తుక్కుగూడ కొండూరు వరకు 26 కిలో మీటర్లు, తార్నక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలో మీటర్లు , జేబీస్ నుంచి తూము కుంట వరకు డబుల్ డెక్కర్ మార్గం 17 కిలో మీటర్లు, ప్యారడైజ్ నుంచి కండ్ల కోయ వరకు డబుల్ డెక్కర్ 12 కిలో మీటర్ల మేర మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్ట్ బీలో భాగంగా నాలుగు మార్గాల్లో మెట్రో ఎక్స్ టెన్షన్ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *