మళ్ళీ లొల్లి షురూ..

rtc cf

రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ బంగ్లాకి మధ్య మళ్ళి రచ్చ మొదలైంది. గతంలో నలుగు ఫైళ్ళ పై సంతకం పెట్టలేదని సుప్రీం కోర్టును ఆశ్రయించిన బారాస ప్రభుత్వానికి తాజాగా మరో సమస్య తలెత్తింది. ప్రజా రవాణా వ్యవస్థను , ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రి వర్గ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన బిల్లును రూపొందించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు పంపించింది. అయితే, ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. దీనికి అనుమతి తెలిపితే ఇతర బిల్లులతో పాటు శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో ఎజెండాలో పొందు పరచలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా గవర్నర్‌ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. బిల్లు పంపి ఇప్పటికే రెండు రోజులైనా అనుమతి ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఆర్టీసి బిల్లు విషయంలో గవర్నర్‌ అనుసరిస్తున్న తాత్సార వైఖరి బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం ఆర్ టీ సి కార్మికులు వ్యక్తం చేస్తున్నారు.

rtc in

ఇదిలాఉంటే ఆర్.టి.సి ఎంప్లాయిస్ ని ప్రభుత్వం లో విలీనం చేస్తూ రాష్ట్ర సియం కేసిఆర్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ మోకారిల్లడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు నిరసనలకు దిగారు. అన్ని డిపోల్లో బస్సులను నిలిపివేశారు. జీడిమెట్ల డిపో ముందు ఆర్.టి.సి ఎంప్లాయిస్ 91బస్సు సర్వీస్ లను నిలిపివేస్తూ దర్నాకు దిగారు. ఈ దర్నాకు అన్ని ఆర్.టి.సి యూనియన్ లు మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్,ఎంప్లాయిస్ యూనియన్,ఎస్.ఢబ్ల్యూ.ఎఫ్,టిజెఎమ్ తదితర యూనియన్స్ ఏక తాటిపైకి వచ్చి ధర్నా చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *