“కోట”లో ఏర్పాట్లు….

golkonda

ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డిజిపి అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్, టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్, టిఎస్ఐఐసి ఎండి నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలకు హాజరయ్యే వారు సభాప్రాంగణంలో ఎంత దూరంలో ఉన్నా కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడిలను ఏర్పాటు చేశామని సమాచార పౌర సంబందాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు.సభకు వచ్చిన ముఖ్య అతిధులు, అధికారులు,సందర్శకులు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు డిజిపికి వివరించారు. హైదరాబాద్ జలమండలి ఆద్వర్యంలో లక్ష వాటర్ ప్యాకెట్ లు, 25 వేల వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేశామని జలమండలి ఎం.డీ. దాన కిషోర్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో 4 ఆంబులెన్సులు, గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒగ గదిని సిద్దంగా ఉంచామని వైధ్యశాఖ అధికారులు తెలిపారు. 3 ఫైర్ ఇంజన్లు, 6 బెస్ట్ బైక్స్, 4 ల్యాడర్లు ఏర్పాటు చేయనున్నామని ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కి దాదాపు 1200 మంది కళాకారులు స్వాగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *